28 February, 2026 | 11:22 PM

శ్రీశైల దేవస్థానంలో రేపు కామదహనం

28-02-2026 06:52 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): శ్రీశైలంలో ఫాల్గుణ శుద్ధ చతుర్దశి సందర్భంగా ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు కామదహన కార్యక్రమాన్ని ఆలయం ముందుభాగంలోని గంగాధర మండపం వద్ద నిర్వహించనున్నట్లు ఆలయ అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు. ముందుగా శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజల అనంతరం ఉత్సవ మూర్తులకు పల్లకీ సేవ చేసి గంగాధర మండపం వద్ద ఆలయ పూజారులు శాస్త్రోక్త పూజలు జరిపిస్తారని తెలిపారు. పురాణాల ప్రకారం, శివుని తపస్సును భంగం చేసిన మన్మథుడిని పరమేశ్వరుడు ఫాల్గుణ శుద్ధ చతుర్దశి రోజున దహించాడని విశ్వాసం. ఆ సాంప్రదాయాన్ని అనుసరించి ఈ కామదహనాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తే శివకటాక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.