15 June, 2026 | 2:22 AM

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం

15-06-2026 12:00 AM

పుటాన్ దొడ్డిలో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభం: ఎమ్మెల్యే విజయుడు

ఎర్రవల్లి, జూన్ 14 :  నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఈ సందర్బంగా గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం పుటాన్ దొడ్డి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులుతో కలిసి ఆదివారం ఆయన ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. గ్రామస్థులకు మెరుగైన పరిపాలనా సేవలు అందించడంలో గ్రామపంచాయతీ కార్యాలయం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన పంచాయతీ భవనాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

గ్రామంలో రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నారాయణ యాదవ్, ఉపసర్పంచ్ విజయలక్ష్మిపరుశరాముడు, పీఏసీఎస్ చైర్మన్ ఈర్లదిన్నె రంగారెడ్డి, మాజీ జెడ్పీటీసీ హనుమంతు రెడ్డి,బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.