30 July, 2026 | 2:22 AM

ఆపద తెచ్చే పంటలు వద్దు..

30-07-2026 01:36 AM
  1. ఆదాయం వచ్చే పంటలు వేయండి 
  2. జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్

గండీడ్, జూలై 29 :  ఒక్క రైతు కూడా నష్ట పోకూడదని సంకల్పంతో ప్రభుత్వం ఆదాయం వచ్చే పంటలను వేయాలని ఆపద తెచ్చే పంటలకు దూరంగా ఉండాలని సూచించడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్ అన్నారు. బుధవారం రైతులకు సాగు పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన హాజరై మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయ అధికారులు సూచిస్తున్న సూచనలను పక్కన పెట్టకూడదని అందరు అమలు చేస్తేనే మంచి దిగుబడి పంటలతో పాటు లాభాల దయకంగా రైతులకు మేలు జరుగుతుందన్నారు.

వాతావరణం ku అనుకూలమైన పంటలు పండిస్తేనే అభివృద్ధి వేగంగా ఉంటుందని నిర్లక్ష్యం అనే మాటకు తావు లేకుండా సాగు చేయాలని సూచించారు. ఇప్పుడు ఇలాంటి సూచనలు అవసరం ఉన్న వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. నకిలీ విత్తనాల దరిచేరకూడదని ప్రతి విషయంలోనూ అధికారుల సూచనలు సలహాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో  శాస్త్రవేత్త డా. కళ్యాణి,మండల వ్యవసాయ అధికారిని రాధమ్మ, సర్పంచ్ భగవంత్ రెడ్డి, ఉపసర్పంచ్ చెన్నయ్య, పీఏసీఎస్ మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణ, వ్యవసాయ విస్తరణ అధికారులు సమత, రక్షిత, మౌనిక, ప్రీతిసుధ పాల్గొన్నారు.