30 July, 2026 | 2:22 AM

ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

30-07-2026 01:37 AM

గండీడ్ జూలై 29 : మండల పరిధిలోని వెన్నచెడ్ గ్రామంలో గురు పౌర్ణమి సందర్భంగా శిరిడి సాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకం, అష్టోత్తర శతనామావళి, మహా మంగళహారతి మహా ప్రసాద నివేదన పూజా కార్యక్రమాలు జరిగాయి.

ఆలయం చుట్టూ స్వామివారి పల్లకి సేవ నిర్వహించారు. భక్తులు తమ మొక్కలను తీర్చుకొని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు .ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగుల అనంత లక్ష్మారెడ్డి, సంగీత దంపతులు, గంగుల ప్రమదమ్మ, సాయి కుమార్ రెడ్డి ,పిఎస్‌ఎస్ డైరెక్టర్ బోయిని పుష్పలత, బోయిని గోపాల్, మాజీ సర్పంచ్ గంగుల పుల్లారెడ్డి, అశోక్  రెడ్డి, నరేందర్ రెడ్డి, నారాయణరెడ్డి, రాములు గౌడ్  తదితరులు పాల్గొన్నారు.