ప్రజావాణిలో సర్పంచి ఫిర్యాదు
* సదరు సొసైటీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్న సర్పంచి
పాపన్నపేట: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభానికి గ్రామ ప్రథమ పౌరురాలైన తనకు సమాచారం ఇవ్వకుండా కేంద్రం ప్రారంభించారని, దీంతో తనకు అవమానం జరిగిందని, ఈ విషయమై సొసైటీ సిబ్బందిపై చర్యలు తీసుకొని, మరలా పునరావృతం కాకుండా చూడాలని సదరు గ్రామ సర్పంచ్ మెదక్ కలెక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఇట్టి కొనుగోలు కేంద్రం ప్రారంభానికి గ్రామ ప్రథమ పౌరురాలైన పద్మకు సమాచారం ఇవ్వకుండా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దీంతో అవమానం జరిగిందని సదరు సర్పంచి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సొసైటీ సిబ్బందిపై చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటన మరల పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు. మాజీ సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు జగన్, మాజీ సర్పంచులు గురుమూర్తి గౌడ్, శ్రీనాథ్ రావు, శ్రీనివాస్, నర్సిహ్మగౌడ్, నాయకులు సోములు, వెంకట్రాంరెడ్డి, రాము, రామకృష్ణ, దుర్గాదాస్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.






