దమ్మపేటలో ఘనంగా భారత రాష్ట్ర సమితి పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకలు
దమ్మపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డా రమేష్, ఉపాధ్యక్షులు గాజోబోయిన యేసు బాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు అందరూ ముందుగా తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి అనంతరం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దొడ్డా రమేష్, ఉపాధ్యక్షులు గాజోబోయిన యేసు బాబు బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సర్పంచ్లు, వార్డు సభ్యులతో నాయకులతో కలిసి కేక్ కట్ చేసారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు దొడ్డా రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక మన గులాబీ జెండా అని, అలుపెరుగని పోరాటంతో రాష్ట్రాన్ని తెచ్చిన జెండా, అభివృద్ధిలో తెలంగాణను అగ్రగామిగా నిలిపిన జెండా, ఎత్తిన జెండాను దించకుండా పట్టుదల, నిబద్ధతతో ప్రయాణం చేసి, ఎన్నో కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొని గమ్యాన్ని ముద్దాడిన ఉద్యమ వీరుడు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనీ, దశాబ్దాల స్వరాష్ట్ర పోరాటలను గమ్యానికి చేర్చిన తెలంగాణ ఆస్తిత్వం బీఆర్ఎస్ పార్టీ అని తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు అందరికీ భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు.






