సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్, వార్డు సభ్యులు
16-03-2026 01:07 PM
పాపన్నపేట,మార్చి16: పాపన్నపేట మండల పరిధిలోని డాక్యతాండాలో సీసీ రోడ్ల నిర్మాణానికి సోమవారం కొబ్బరికాయ కొట్టి పనులను తాండ సర్పంచి గుగులోత్ స్వప్న హీరోలాల్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచి స్వప్న మాట్లాడుతూ.. తండాలో ప్రతి వీధిలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి మౌలిక వసతులు మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకాంత్, వార్డు సభ్యులు విట్టల్, నాయకులు తులసిరామ్, ప్రేమ్ కుమార్, గణేష్, జనార్ధన్ రెడ్డి, రవి, రాంచంధర్, రాజు తదితరులు పాల్గొన్నారు.




