29 June, 2026 | 9:53 AM

సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

29-06-2026 08:35 AM

డివైడర్ ను ఢీకొని తండ్రి కొడుకులు మృతి..

సిద్దిపేట రూరల్: సిద్దిపేట(Siddipet) పట్టణ శివారులోని బూరుగుపల్లి వద్ద ఉన్న లావణ్య గార్డెన్ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిద్దిపేట రూరల్ ఎస్సై నవత తెలిపిన వివరాల ప్రకారం మిరుదొడ్డి మండలం మల్లు పల్లి గ్రామానికి చెందిన అక్క గారి సాయి (26) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కాగా ఆదివారం దుబ్బాక మండలం అప్పనపల్లి లో బంధువుల ఇంటికి ఫంక్షన్ నిమిత్తం వచ్చిన సాయి, రాత్రివేళలో తన కొడుకు హర్షవర్ధన్ (5) తో కలిసి సిద్దిపేటకు వెళ్ళొస్తానని చెప్పి బంధువుల కారును తీసుకొని వస్తుండగా, ఇరుకోడు గ్రామం దాటిన తర్వాత బూర్గు పల్లి వద్ద వారి కారు డివైడర్ ను వేగంగా ఢీకొట్టడం తో, ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు