16 March, 2026 | 2:52 PM

పశువులకు గాలికుంటు నిరోధిక టీకాలను వేయించాలి

16-03-2026 01:09 PM

జిల్లా కలెక్టర్ కె. హరిత

వాంకిడి (విజయ క్రాంతి): జిల్లాలో పశువుల యజమానులు, పశువులకు ఉచితంగా గాలికుంటు నిరోధక టీకాలను వేయించాలని కలెక్టర్ కె. హరిత అన్నారు. సోమవారం రోజున వాంకిడి మండలం బంభార గ్రామములో జిల్లా పశు వైద్య పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సంపూర్ణత  అభియాన్ లో భాగంగా జాతీయ వ్యాక్సినేషన్ డే కార్యక్రమానికి  జిల్లా పశు వైద్య& పశుసంవర్ధక శాఖ అధికారి సురేష్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమాదేవి తో కలిసి కలెక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ  పశువులు,మనకు సంపద, ధనం వాటి ఆరోగ్యంపై ప్రతి రైతు దృష్టి సాధించాలన్నారు. వ్యవసాయానికి పశువులు ఎంత ఉపయోగపడతాయో వాటిని కాపాడుకోవడం కూడ మన అందరి బాధ్యత, అన్నారు. గ్రామంలో సుమారుగా 4000 పైబడి పశువులు ఉన్నందున ఈ గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగిందని, గాలికుంటు వ్యాధి, అంటువ్యాధి లాంటిదని వాటిని  నిర్మూలించడం ధ్యేయమని తెలిపారు. జిల్లాలో 100% గాలికుంటూ నిరోధికా టీకాల కార్యక్రమాన్ని పూర్తిచేయాలన్నారు.

అనంతరం వాంకిడి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ సంపూర్ణత అభియాన్ -2 ఓ లో భాగంగా జాతీయ టికా దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాంతో  కలిసి 9 నుండి 14 సంవత్సరాల లోపు బాలికలకు హెచ్. పి వి  వ్యాక్సిన్ అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు. భవిష్యత్తులో బాలికలకు గర్భాశయ క్యాన్సర్  వ్యాధులకు దూరంగా ఉండడానికి ఈ టీకా ఎంతో ఉపయోగపడుతుందని  తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, ప్రజలు, బాలికలు, సంబందిత, అధికారులు పాల్గొన్నారు.