16 March, 2026 | 4:11 PM

ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి

16-03-2026 01:06 PM

మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): పట్టణ మున్సిపల్ పరిధిలోని అన్ని వాణిజ్య సముదాయాలు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ పొందాలని మున్సిపల్ కమిషనర్ బి. నాగిరెడ్డి తెలిపారు. మున్సిపల్ పరిధిలో ఉన్న దుకాణాలు, కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్లు, ఆసుపత్రులు, హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలు మార్చి 31లోగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని సూచించారు.

నిర్దేశిత గడువులోగా లైసెన్స్ పొందని వ్యాపారులపై ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు 25 శాతం పెనాల్టీ విధిస్తామని హేచ్చరించారు. జూలై 1 నుంచి 50 శాతం పెనాల్టీ విధించడంతో పాటు అవసరమైతే షాపులను సీజ్ చేసే చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలోని వ్యాపారులు ముందుకు వచ్చి ట్రేడ్ లైసెన్స్ తీసుకొని పట్టణ అభివృద్ధికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వివరాల కోసం తిరుపతయ్య (9550942030), సతీష్ (9160000617) ను సంప్రదించాలని సూచించారు