చెరువు కాదిది స్టేడియం!
29-06-2026 08:38 AM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ఎన్టీఆర్ స్టేడియంలో(NTR Stadium) వరద నీరు నిలిచి చెరువుగా మారింది. ఇటీవల స్టేడియం అభివృద్ధి పనులు, వాకింగ్ ట్రాక్, కొత్తగా ప్రహరీ గోడ నిర్మాణం చేశారు. అయితే స్టేడియంలో లెవెలింగ్ పనులు సరిగా చేయకపోవడం, వరద నీరు బయటకు వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయలేదనీ, దీని వల్ల స్టేడియం కొద్ది పాటి వర్షానికే చెరువు గా మారి, క్రీడాకారులకు, వాకర్స్ కు అసౌకర్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






