ఇసుక తరలిస్తున్న తిప్పర్ల పట్టివేత
29-06-2026 08:36 AM
కోయిలకొండ : మండలంలో సూరారం వాగు నుంచి రాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు వాహనాలను కోయిలకొండ పోలీసులు పట్టుకున్నారు. AP05 TF 2618 భారత్ బెంజ్,TS 12 UB2706 కలిగిన టిప్పర్ లని పట్టుకొని కోయిలకొండ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. వాహనాల యొక్క ఓనర్ల డ్రైవర్ల పై కేసు నమోదు చేయడమైనదని కోయిలకొండ ఎస్సై నాగరాజు తెలిపారు. అక్రమంగా అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్ఐ నాగరాజు పేర్కొన్నారు.






