calender_icon.png 19 February, 2026 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ సంత్ సేవాలాల్ 316వ అవతార దినోత్సవానికి రండి

19-02-2026 12:54:53 PM

అధికారులకు , సామాన్యులకు నిర్వాహకుల ఆహ్వానం. 

తాండూరు, 19 ఫిబ్రవరి,(విజయ క్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కందనెల్లి తండా యాడి బాపు గడ్ లో ఈనెల 20వ తేదీన అనగా రేపు శుక్రవారం బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ 316వ అవతార దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు శ్రీ రామవత్ సురేందర్ నాయక్ మహారాజ్ తెలిపారు. ఈ మేరకు ఆయన నియోజకవర్గంలో పలువురు అధికారులకు మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, సామాన్యులకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా సురేందర్ నాయక్ మహారాజ్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్  అవతార మహోత్సవ భోగ్ పూజ, ఆధ్యాత్మిక సాంస్కృతిక వేడుకలు, భారత్ బంజారా ధర్మస్థాపన సందేశ సభ అనంతరం తీర్థ ప్రసాదాలు అన్నప్రసాద వితరణ చేసేందుకు ఏర్పాటు జరిగాయని అన్నారు.