28 June, 2026 | 1:54 AM

రోడ్డుపై చెత్త వేయద్దన్నందుకు పారిశుద్ధ్య కార్మికురాలి జుట్టు పట్టుకొని దాడి

28-06-2026 12:46 AM

కూకట్‌పల్లి, జూన్ 27 (విజయక్రాంతి) : రోడ్డు మీద చెత్త వేయద్దు అన్నందుకు పారిశుధ్య కా ర్మికురాలి జు ట్టు పట్టుకొని కొట్టిన సంఘటన శనివారం ఉదయం ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలో శనివారం ఉదయం జరిగింది. ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలో పలుచోట్ల బహిరంగంగా చెత్త వేసే ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలలోని నివాసితులకు చెత్త బయట పారవేయద్దు అవగాహన కలిగించిన అనంతరం చెత్త వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.

శనివారం ఉదయం వడ్డేపల్లి ఎంక్లేవ్ దీనబంధు కాలనీ సమీపం లో నాలా పక్కన ఓ యువతి చెత్త వేస్తుండగా పారిశుద్ధ్య కార్మికురాలు మైబు అడ్డు కుంది. దీంతో ఆ యువతి పారిశుద్ధ్య కార్మికురాలి జుట్టు పట్టుకొని దాడి చేసింది. దీం తో పారిశుద్ధ్య కార్మికురాలు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతోపాటు జగద్గిరి గుట్ట పోలీస్ స్టేషన్లో దాడి చేసిన యువతిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేశారు.

పారిశుద్ధ్య కార్మికులపై దాడి చేస్తే చర్యలు తప్పవు: డీసీ.చాముండేశ్వరి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికులపై దాడులు చేస్తే సహిం చే ప్రసక్తే లేదని ఆల్విన్ కాలనీ డీసీ చాముండేశ్వరి హెచ్చరించారు. పారిశుద్ధ్య కార్మి కురాలికి పూర్తి అండగా ఉంటామన్నారు.