28 June, 2026 | 1:53 AM

బిషప్‌గా గోన పిలిఫ్

28-06-2026 12:45 AM
  1. హోలిస్పిరిట్ థియోలాజికల్ యూనివర్సిటీ బృందం, 
  2. రెవ గోన అనిల్‌కు థియోలాజికల్ మాస్టర్ డిగ్రీ ప్రదానం

ముషీరాబాద్, జూన్ 27 (విజయక్రాం తి): ఉప్పల్ స్వరూప్ నగర్ హోరేబ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన క్రైస్తవ బిషప్ పట్టాభిషేక ప్రార్థన మహోత్సవంలో ఉప్పల్ చెందిన రెవ, డా. గోన పిలిఫ్, పలువురు క్రైస్తవ ప్రముఖుల సమక్షంలో బిషప్ గా అబిషేకింబడినట్లు యూనివర్సిటీ  డైరెక్టర్ అబ్రహం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో జెరూసలేం మత్తయ్య, బిషప్ జాషువా బైబిల్ వాక్యం, బిషప్ ధనరాజ్ కోట అబిషేక ప్రార్థన, బిషప్ భాస్కర్ రెడ్డి బిషప్ వస్త్రధారణ, బిషప్ సంజయ్ కిరీటీ దారణ, బిషప్ ఆనంద్ పట్టా సర్టిఫికెట్ బహాకరణ, బిషప్ వీరాజీ ఇశ్రాయేల్ మెమొంటో ప్రదానం చేశారు. ఫిలిప్ క్రైస్తవ సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా బిషప్ పట్టాభిషేకం జరగడం పట్ల మాజీ కార్పొరేటర్ రజి త పరమేశ్వర రెడ్డి,  పలువురు క్రైస్తవ నాయకులు అభినందనలు తెలిపారు.