పారిశుద్ధ్య సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
జోనల్ కమిషనర్ సత్యనారాయణ
మలక్‌పేట్, జూన్ 10 (విజయక్రాంతి): పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా తమ పరిధిలోని ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పర్యటిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జీ హెచ్ యం సి చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ కన్నం సత్యనారాయణ అధికారులకు ఆదేశించారు.
యాకుత్ పురా, సంతోష్ నగర్, చార్మినార్ సర్కిళ్ల కు చెందిన పారిశుద్ధ్య నిర్వాణ, అధికారులు, సిబ్బంది పనితీరుపై చాంద్రాయణగుట్ట నర్కి పూల్‌బాగ్‌లోని జోనల్ కార్యాలయంలో బుధవారం ఉదయం జోనల్ కమిషనర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్లు, పారిశుద్ధ్య విభాగం అధికారులు, సానిటరీ సూపర్వైజర్లు, ఫీల్ అసిస్టెంట్ల, రాంకీ సంస్థ ప్రతి నిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
పారిశుధ్య నిర్వహణ , రాంకీ సంస్థ సిబ్బంది చెత్త తరలింపు, స్వచ్ఛ ఆటో టిప్పర్ సిబ్బంది, ఎస్‌ఎఫ్‌ఏ ల పనితీరు, ఇతర సమస్యలపై జోనల్ కమిషనర్ సత్యనారాయణ ఆరా తీశారు. రోడ్లపై పేరుకుపోయే చెత్తను ఉదయం, రాత్రి వేళలతో పాటు ప్రత్యేకంగా మధ్యాహ్నం సమయం లో తొలగించాలని జోనల్ కమిషనర్ సత్యనారాయణ రాంకీ సంస్థ ప్రతినిధులు నంద కిషోర్, అరవింద్‌లకు సూచించారు.
ఈ సం దర్భంగా జోనల్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ... జోన్ పరిధిలోని సర్కిల్, వార్డుల వారిగా విధులు నిర్వహిస్తున్న అధికారులు, సూపర్వైజర్లు, ఎస్‌ఎఫ్‌ఏ లు తమ పరిధిలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. మా ర్కెట్లు, ప్రధాన రద్దీ ప్రాంతాల్లో చెత్త సమస్య లే కుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నా రు.
ప్రజలు తమ ఇంట్లోని చెత్తను నాలాలు, రోడ్లపై వేయకుండా ఇంటి వద్దకు వచ్చే స్వచ్ఛ ఆటో టిప్పర్ సిబ్బందికి చెత్త అందజేయాలన్నారు. స్థానికులు నాలాల్లో చెత్త వే యకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. నగరాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజల సహకారం ఎంతో అవసర మన్నారు. సమావేశంలో యాకుత్ పు రా, సంతోష్ సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు సుభాష్ రావు, భాస్కర్ రెడ్డి, శానిటేషన్ డీఈ వెంక ట్ రాజు, అధికారులు పాల్గొన్నారు.






