బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవాల ముగింపు సభకు భారీ ఏర్పాట్లు
- జూన్ 22న నోవాటెల్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రుల సమక్షంలో వేడుకలు
- క్యాన్సర్ బాధిత చిన్నారులతో జన్మదిన వేడుకలు జరుపుకొన్న బాలకృష్ణ
బంజారాహిల్స్, జూన్ 10 (విజయక్రాంతి): బసవతారకం ఇండో అమెరికన్ క్యా న్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రజతోత్సవాల ముగింపు సభను జూన్ 22న హైదరాబాద్ హైటెక్ సిటీలోని నవాటెల్ హోటల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు సం స్థ ఛైర్మన్, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. ఆస్పత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కార్యక్రమ వివరాలను వెల్లడించారు.
2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ సంస్థ 25 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకుందని, స్వర్గీయ నందమూరి తారక రామారావు మరియు బసవతారకం ఆశయాలకు అనుగుణంగా సేవలను అందిస్తూ ముందుకు సాగుతోందని బాలకృష్ణ తెలిపారు.రజతోత్సవాల సందర్భంగా ఏడాది పొడవునా పలు కార్యక్రమాలు నిర్వహించామని, వాటి ముగింపుగా ఈ నెల 22న ప్రత్యేక సభ నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఈ వేడుకలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా,మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నా యుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు వెల్లడించారు. అదనంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్, తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఆంధ్రప్రదేశ్ ఆరో గ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితరులు పాల్గొననున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా ఆస్పత్రి గత 25 ఏళ్ల సేవలను సమీక్షించడంతో పాటు, హైదరాబాద్లో నిర్మించనున్న నూతన నార్త్ బ్లాక్ మరియు అమరావతి సమీపంలోని తుళ్లూరులో నిర్మాణంలో ఉన్న కొత్త క్యాన్సర్ ఆస్పత్రి ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు బాలకృష్ణ పేర్కొన్నారు. లాభాపేక్ష లేకుండా సేవా దృక్ప థంతో సంస్థను నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో కూడా అదే విధానాన్ని కొనసా గిస్తామని స్పష్టం చేశారు.
చిన్నారులతో పుట్టినరోజు వేడుకలు
మీడియా సమావేశానికి ముందు ఆస్పత్రిలో క్యాన్సర్తో చికిత్స పొందుతున్న చిన్నా రులతో కలిసి బాలకృష్ణ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఆస్పత్రి సిబ్బం ది ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేసి చిన్నారులతో పంచుకున్నారు. అనంతరం వారికి బొమ్మలు, బహుమతులు అందజేసి ఆత్మీయంగా గడిపారు.ఈ సందర్భంగా పలువు రు దాతలు అందించిన విరాళాలను స్వీకరించారు.
హైదరాబాద్కు చెందిన సీతారామ రాజు అందించిన రూ.1 లక్ష విరాళంతో పాటు, త్రివేణి, కృష్ణవేణి పాఠశాలల విద్యార్థులు క్యాన్సర్ రోగుల సహాయార్థం సేకరిం చిన రూ.1,01,116 విరాళాన్ని ఆస్పత్రికి అందజేశారు. తుళ్లూరు ఆస్పత్రి నిర్మాణం కోసం కాకర్ల రాఘవేంద్రరావు అందించిన రూ.10 లక్షల విరాళాన్ని కూడా స్వీకరించా రు. విరాళాలు అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపిన బాలకృష్ణ, ముఖ్యంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న విద్యార్థుల సామాజిక బాధ్యతను అభినందించారు.
తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియ జేస్తూ, భవిష్యత్తులో మరింత సేవా కార్యక్రమాలు చేపట్టే శక్తిని భగవంతుడు ప్రసాదిం చాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మెడికల్ డైరెక్టర్ డా. టి. సుబ్రహ్మణ్యేశ్వరరావు, మెడికల్ సూపరింటెండెంట్ డా. ఫణికోటేశ్వరరావు, అసోసియేట్ డైరెక్టర్ (అకడమిక్స్) డా. కల్పనా రఘునాథ్ వైద్యులు, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.






