29 July, 2026 | 9:37 PM

Breaking News

మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్   •   నల్లబండగూడెం సాయిమందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు   •   గురుపౌర్ణమి సందర్భంగా సామూహిక ధ్యానం   •   ఆర్మూర్ ఎంఈవోగా రాజేశ్వర్   •   ఏజెన్సీలో భారీ వర్షాలు.. గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్   •   భిక్కనూర్ పీహెచ్‌సీలో వైద్య సేవలపై డైరెక్టర్ ఆకస్మిక తనిఖీ   •   సువర్ణ వనమాల దశదిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •  

బురద రోడ్డులో ఇరుక్కుపోయిన ఆర్టీసీ బస్సు

29-07-2026 08:31 PM

తప్పిన పెద్ద ప్రమాదం

భయాందోళనలో విద్యార్థినులు

​చేగుంట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా, చేగుంట మండలం, ఎన్ ఎచ్ 44 నుండి మోడల్ స్కూల్ వెళ్లే తార్ రోడ్డు గుంతలమయం కావడంతో వేసిన మట్టి రోడ్డు వర్షాలకు పూర్తిగా బురదగా మారింది. బుధవారం ఉదయం విద్యార్థినులను పాఠశాలకు తీసుకెళ్తున్న మెదక్ డిపో ఆర్టీసీ బస్సు (TS 35 Z 0012) ఆ బురదలో కదలలేక ఇరుక్కుపోయి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి జారబోయింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పి, విద్యార్థినులు ఊపిరి పీల్చుకుని బస్సు దిగి ప్రత్యామ్నాయ మార్గాల్లో పాఠశాలకు వెళ్లారు. ప్రమాదకరంగా మారిన ఈ రోడ్డుకు అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.