29 July, 2026 | 9:45 PM

Breaking News

బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ప్లేట్లు, నోట్‌బుక్స్ పంపిణీ   •   విశ్వబ్రాహ్మణ సంఘం గుండి గ్రామ కమిటీ ఏర్పాటు   •   సిఐ నీలం రవికి ఘన సన్మానం   •   మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్   •   నల్లబండగూడెం సాయిమందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు   •   గురుపౌర్ణమి సందర్భంగా సామూహిక ధ్యానం   •   ఆర్మూర్ ఎంఈవోగా రాజేశ్వర్   •   ఏజెన్సీలో భారీ వర్షాలు.. గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్   •   భిక్కనూర్ పీహెచ్‌సీలో వైద్య సేవలపై డైరెక్టర్ ఆకస్మిక తనిఖీ   •  

గురుపౌర్ణమి సందర్భంగా సామూహిక ధ్యానం

29-07-2026 09:22 PM

చిట్యాల,(విజయక్రాంతి): గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యానం, ఆత్మజ్ఞాన సత్సంగం భక్తిశ్రద్ధలతో  నిర్వహించగా,  మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీత రమేష్ ముఖ్య అతిథిగా బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గురువుల ఆశీస్సులు మన జీవితానికి దిశానిర్దేశం చేస్తాయని, ధ్యానం ద్వారా మనస్సుకు ప్రశాంతత, ఆత్మకు ఆత్మజ్ఞానం లభిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో ధ్యానాన్ని అలవర్చుకోవడం ద్వారా ఒత్తిడిని అధిగమించి ఆనందమయమైన జీవితం గడపవచ్చని సూచించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వ్యక్తిగత వికాసంతో పాటు సమాజంలో సత్సంకల్పాలు, సద్భావనలు పెంపొందించేందుకు దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, ధ్యాన సాధకులు పాల్గొని గురుపూజ నిర్వహించి, సామూహిక ధ్యానంలో పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు.