29 July, 2026 | 10:10 PM

ఆర్మూర్ ఎంఈవోగా రాజేశ్వర్

29-07-2026 09:20 PM

ఆర్మూర్,(విజయ క్రాంతి): ఆర్మూర్ ఇంచార్జ్ ఎంఈవోగా రాజేశ్వర్ నియమితులైనారు. ఇదివరకు ఎంఈవోగా ఉన్న రాజ గంగారాం తన వ్యక్తిగత కారణాలతో ఇంచార్జ్ ఎంఈవో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు మామిడిపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా కొనసాగుతున్న రాజేశ్వర్ ను ఇంచార్జి ఎంఈవోగా జిల్లా విద్యాశాఖ అధికారి నియమించారు. దీంతో బుధవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎంఈవోకు పలువురు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు అభినందించారు.