29 July, 2026 | 10:11 PM

నల్లబండగూడెం సాయిమందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

29-07-2026 09:24 PM

పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పద్మావతి

భారీగా హాజరైన భక్తులు

కోదాడ,(విజయక్రాంతి): కోదాడ మండలంలోని నల్లబండగూడెం గ్రామంలో రామాపురం క్రాస్ రోడ్డులో ఉన్న షిర్డీ సాయిబాబా మందిరంలో గురుపౌర్ణమి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ – ఆంధ్ర రెండు రాష్ర్టాల సరిహద్దు ప్రాంతంలో ఆలయం ఉండడంతో ఉదయం నుండే ఆయా ప్రాంతాల నుండి హాజరైన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఎమ్మెల్యే పద్మావతి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తులు పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకొని, తీర్దప్రసాదాలు స్వీకరించారు. దాతల సహకారంతో అన్నదానం నిర్వహించారు. గురుపౌర్ణమి సందర్భంగా ఆలయంలో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నల్లపాటి నర్సింహారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవేటి రామారావు, లక్ష్మీనారాయణరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు, వైస్ చైర్మన్ మల్లేశ్వరి, సామినేని ప్రమీల, మండల పార్టీ అధ్యక్షుడు శరభేశ్వరరావు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కొత్త గురవయ్య, అర్చకుడు సాయిశర్మ, భక్తులు పాల్గొన్నారు.