29 July, 2026 | 10:26 PM

మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు

29-07-2026 09:35 PM

మంథని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధికి చెందిన మాజీ ఉపసర్పంచ్ ఇనుముల సతీష్ తల్లి ఇనుముల గౌరమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా గౌరమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన శ్రీను బాబు, ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొని గౌరమ్మకు నివాళులర్పించారు.