సువర్ణ వనమాల దశదిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు
మంథనిలో సువర్ణ వనమాల దశదిన కార్యక్రమంలో కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు
మంథని, జూలై 29(విజయ క్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు సహోదరి, మంథని మాజీ సర్పంచ్ స్వర్గీయ సువర్ణ చంటయ్య సతీమణి శ్రీమతి సువర్ణ వనమాల దశదిన కార్యక్రమం బుధవారం మంథని పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నివాళులర్పించిన శ్రీను బాబు:
కార్యక్రమంలో భాగంగా దుద్దిళ్ల శ్రీను బాబు సువర్ణ వనమాల చిత్రపటానికి పూలమాలలు వేసి, భావోద్వేగంగా ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారిని వ్యక్తిగతంగా పరామర్శించారు. సువర్ణ వనమాల సేవలను, జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారికి కొండంత ధైర్యం చెబుతూ ఓదార్పునందించారు.
శ్రీను బాబు తో పాటు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని స్వర్గీయ సువర్ణ వనమాల కి అశ్రునయనాల మధ్య నివాళులర్పించారు.






