7 May, 2026 | 1:11 AM

తిమ్మంపేటకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి

07-05-2026 12:20 AM

ములకలపల్లి,మే 6 (విజయక్రాంతి):  భద్రాచలం నుంచి తిమ్మంపేట మీదుగా ములకలపల్లి,పాల్వంచ వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండల పరిధిలోని తిమ్మంపేట గ్రామంలో తిమ్మంపేట సిపిఎం పార్టీ గ్రామశాఖ పార్టీ జనరల్ బాడీ సమావేశం గౌరీ  నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలం అయ్యిందన్నారు.

రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు రైతులకు చేల్లిస్తున్నామని పెద్ద పెద్ద ప్రకటనలకే పరిమితం అవుతున్నారని రాష్ట్ర రైతాంగ సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.సాగులో ఉన్న పోడు భూములను సర్వే నిర్వహించి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.గ్రామ పంచాయితీలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి గ్రామపంచాయతీలను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కారం పుల్లయ్య,మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు,నిమ్మల మధు, మాజీ సర్పంచ్ గౌరీ లక్ష్మీ, సర్పంచ్ లు గణపసుజాత,వగ్గేలరాధ,గడ్డం వెంకటేశ్వర్లు,రావుల పుల్లయ్య,ఉప సర్పంచ్ సాయి రాం,పోతుగంటి బాలరాజు, పుప్పాల హరినాథ్,కాకర్ల సుధాకర్,రాజినేని రాజు,బత్తుల కిషోర్,నాగేంద్రబాబు,కాకర్ల సత్యవతి తదితరులు పాల్గొన్నారు.