6 June, 2026 | 6:31 PM

Breaking News

గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించాలి: ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి   •   లింగారెడ్డిగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   ప్రణాళికాబద్ధంగా కార్పొరేషన్‌ను అభివృద్ధి చేసుకుందాం   •   ఫార్మర్ రిజిస్టీ తప్పని సరి   •   వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన రాఘవపల్లి గ్రామ సర్పంచ్, పాలకవర్గం   •   కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ సోయం సత్యవతి అధ్యక్షతన గ్రామ సభ   •   ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ శ్రీలత   •   గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •   కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •  

శంకుస్థాపనకే పరిమితమైన రోడ్డు నిర్మాణం

06-06-2026 05:10 PM

వెల్దండ: మండల పరిధిలోని బైరాపూర్ నుంచి అజిలాపూర్ వరకు చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులు శంకుస్థాపనకే పరిమితమయ్యాయని స్థానికులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేయగా, 2025 జూన్ 23న స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు పనులను ప్రారంభించారు. కానీ ఏడాది గడుస్తున్నా పనులు పూర్తి కాకపోవడంతో రహదారి అసంపూర్తిగా మిగిలిపోయింది.

ముఖ్యంగా కల్వర్టు నిర్మాణాన్ని మధ్యలోనే వదిలేయడంతో వివిధ గ్రామాలకు, వ్యవసాయ పొలాలకు వెళ్లే ప్రజలు, రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు పనులు పూర్తి చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వెంటనే చొరవ తీసుకుని రోడ్డు, కల్వర్టు నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని వారు కోరుతున్నారు.