మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం
చర్లలో పర్యావరణ వారోత్సవాల సందడి
ఒక్కొక్కరు మొక్క నాటాలని ఎంపీడీఓ ఈదయ్య పిలుపు.
చర్ల,(విజయక్రాంతి): ప్రపంచ పర్యావరణ దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని చర్ల మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) ఈదయ్య ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. పర్యావరణ వారోత్సవాలలో భాగంగా మండలంలోని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక మొక్కను నాటి, పర్యావరణ పరిరక్షణకు తమవంతు కృషి చేయాలని ఎంపీడీఓ ఈదయ్య కోరారు. "పచ్చదనం పెంచడం ద్వారానే భావితరాలకు మంచి భవిష్యత్తును అందించగలం.
మొక్కలు నాటడం మనందరి బాధ్యత" అని ఆయన పేర్కొన్నారు. మండలంలో పచ్చదనం పెంపు, భూగర్భ జలాల సంరక్షణ ప్రతి ఇంటికీ ఒక మొక్క-ప్రతి వ్యక్తికి ఒక బాధ్యతని "మొక్కలు నాటుదాం, భూమిని, పర్యావరణాన్ని, కాపాడుదాం"అని పిలుపునిచ్చారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నట్లు. విద్యార్థులతో పాటు స్వచ్ఛంద సంస్థలను కూడా భాగస్వామ్యం చేయనున్నారని అన్నారు. జూన్ 5 నుంచి ప్రారంభమైన ఈ పర్యావరణ వారోత్సవాలు వారం రోజుల పాటు కొనసాగనున్నాయని తెలిపారు.






