బోడులో ఖేతి బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహణ
టేకులపల్లి,(విజయక్రాంతి): కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల (జూన్ 1 నుండి ౩౦, 2026 వరకు) ఖేతి బచావో అభియాన్ కార్యక్రమం లొ భాగంగా మట్టి పరీక్షా, సమతుల్య ఎరువుల వినియోగం అనే కార్యక్రమాన్ని టేకులపల్లి మండలం బోడు గ్రామంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాo కోఆర్డినేటర్ డా. టి. భరత్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రైతులు పోటీతత్త్వంతో మోతాదుకు మించి ఎరువులను వాడకం చెయ్యడం వలన భూసారం తగ్గిపోతుందని తెలిపారు.
కావున రైతులు జాగృతులయ్యి విచక్షనతో ఎరువుల వినియోగన్ని చేపట్టాలని, రైతులు ప్రతి ఒక్కరు మట్టి పరీక్షా చేయించుకోవాలన్నారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న వరి రకాలు ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వావిద్యాలయం వారు విడుదల చేసిన రకాలను ఎంచుకొని సాగు చేసుకోవాలని చెప్పారు. అలాగే రైతులు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా వరిలో అందిస్తున్న రకాలు డబ్ల్యూ జి ఎల్ 44(సిద్ది), కె ఎన్ ఎమ్ 1638 పొంది అధికంగా దిగుబదులను సాధించాలని తెలిపారు.
ఉద్యాన శాస్త్రవేత్త శివ మాట్లాడుతూ.. రైతులు ప్రతి ఒక్కరు ఇంట్లోనే ప్రకృతి వ్యవసాయ విధానంలో కూరగాయలు పండించేకోవాలని కోరారు. ఒకే రకమైన పంటలను పండిస్తున్నారని, అందువలన ఇది రైతులకు కూడా గిట్టుబాటు కావడం లేదని, ఉధ్యాన పంటలు ఆయిల్ పామ్, మునగ సాగు తీగజాతి కూరగాయల ద్వారా పంట మార్పిడి పాటించడం ద్వారా సుస్థిర ఆదాయాన్ని పొందటంతో పాటు నేలతల్లి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలొ పలువురు వ్యవసాయాధి కారులు, 40 మంది రైతులు పాల్గొన్నారు.






