మైసా కోసం కఠోర సాధన!
రష్మిక మందన్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’తో తన కెరీర్‌లో అత్యంత సవాలుతో కూడిన దశలోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే ఈ సినిమా ఇంటెన్స్ గ్లింప్స్‌తో మంచి బజ్ సృష్టించగా, ఇప్పుడు రష్మిక ఆఫ్ స్క్రీన్ డెడికేషన్ అంచనాలను మరింత పెంచుతోంది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిలమ్స్ పతాకంపై రూపొందుతున్న ఈ ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ సినిమాలో రష్మిక ఒక గోండ్ తెగ అమ్మాయిగా కనిపించనుంది.
ఈ పాత్రకు ఎమోషనల్ డెప్త్‌తోపాటు శారీరక దృఢత్వం కూడా అవసరం. అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్ ఆండి లాంగ్ పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాలు రూపొందుతున్నాయి. కథ విన్న తర్వాత రష్మిక ఈ పాత్ర కోసం తనను తాను శారీరకంగా, మానసికంగా పూర్తిగా మార్చుకోవాలని ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకుంది. రా, రియల్‌గా అనిపించే యాక్షన్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలనే లక్ష్యంతో ఆమె బ్యాంకాక్‌కు వెళ్లి కఠినమైన స్టంట్, కాంబాట్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు.
ఆమె రోజువారీ శిక్షణ దాదాపు ఎనిమిది గంటల పాటు అడ్వాన్స్ స్టంట్స్, హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్, హై స్పీడ్ యాక్షన్ టెక్నిక్స్ నేర్చుకుంటోంది. ఆమె ట్రైనింగ్ ఫోటోలు చూస్తే సాధారణంగా కనిపించే సాఫ్ట్ నేచర్ ఇమేజ్‌కు పూర్తిగా భిన్నంగా, ఒక దృఢ సంకల్పంతో కూడిన యోధురాలిలా కనిపి స్తోంది.
త్వరలో కేరళలో 16 రోజులపాటు కొనసాగే కీలక యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. అందుకు అనుగుణంగా ఆమె ట్రైనింగ్ సాగుతోంది. ఈశ్వరి రావు, గురు సోమసుందరం, రావు రమేశ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని శ్రేయాస్ పీ కృష్ణ నిర్వహిస్తుండగా, జేక్స్ బీజోయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.






