20 April, 2026 | 6:29 AM

నా మాటలను వక్రీకరించారు

20-04-2026 01:12 AM

నటుడు ప్రకాశ్‌రాజ్

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): ‘ఇటీవల నేను ఓ సాహితీ కార్యక్రమంలో ఇచ్చిన ప్రసంగంలోని కొన్ని మాటలను మాత్రమే’ తీసుకుని కొందరు వక్రీకరించారని నటుడు ప్రకాశ్‌రాజ్ తెలిపారు. శ్రీరాముడిపై ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా ఆయన సోషల్ మీడియాలో స్పందించారు.

‘నేనేదో అవతార పురుషుడు శ్రీరాముడి గురించి తప్పుగా మాట్లాడానని, హిందువుల మనోభావాలను గాయపరిచానని అంటున్నారు. ‘అన్ని  ధర్మాలను,  అందరినీ ప్రేమించే నాకు ఆ అవసరం లేదు. కొందరు రాజకీయ నాయకులు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, నన్ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని పేర్కొన్నారు.