21 April, 2026 | 5:19 AM

ఘనంగా రెజొ కేజీ వర్సిటీ గ్రాడ్యుయేషన్ వేడుకలు

21-04-2026 02:22 AM

స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్ స్కూల్, శ్రీనగర్‌లో నిర్వహణ

డాక్టర్ జీ రాఘవేంద్ర, యూరాలజిస్ట్‌చే స్నాతకోత్సవ పట్టాలు 

ఖమ్మం, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): స్థానిక శ్రీనగర్ కాలనీలోగల స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్ స్కూల్లో గ్రాడ్యుయేషన్‌డే వేడుకలకు ముఖ్య అతిథిగా డాక్టర్ జీ రాఘవేంద్ర, యూరాలజిస్, స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్ స్కూ ల్ శ్రీనగర్ డైరెక్టర్స్ కొండా శ్రీధర్ రావు, కొండా కృష్ణవేణి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి గ్రాడ్యూయేషన్ డేను ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్ కేజీ విద్యార్థులు స్నాతకోత్సవ వేషాధారణలో వేదికపై వారు హుషారుగా పట్టాలు అందుకున్నారు. కిండర్ గ్రాడ్యుయే ట్స్ ఆట, పాటలతో ప్రాంగణం అంతా పం డుగను తలపించేలా అందరిని ఆనందపర్చారు. ముఖ్య అతిథిగా డాక్టర్ జీ రాఘ వేంద్ర మాట్లాడుతూ కేజీ విద్యార్థుల్లో ఈ గ్రాడ్యుయేషన్ నూతన ఉత్సాహం కలిగిస్తుంది.

నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతుల ను పూర్తి చేసుకొని మొదటి తరగతిలో అడుగుపెట్టబోతున్న కేజీ విద్యార్థులందరికి మనస్పూర్తిగా అభినందనలు, ఆశీస్సులు తెలియ జేశారు. యూనివర్సిటి స్థాయిలో డిగ్రీ పూర్తి చేసుకునే విద్యార్థులకు డిగ్రీ పట్టా ఇస్తున్నట్లుగా కేజీ గ్రాడ్యుయేషన్ ఏర్పాటు చేసి విద్యార్థులకు మరువలేని తీపి జ్ఞాపకంగా, ప్రోత్సాహాన్ని కలిగిస్తున్న స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్ శ్రీనగర్ యాజమాన్యానికి అభినందన లు తెలియజేశారు.డైరెక్టర్ కె.శ్రీధర్ రావు మాట్లాడుతూ తల్లిదండ్రులే పిల్లలకు మొద టి ఉపాధ్యాయులు అని, వారు తమ పిల్లల కోసం ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించాలని, పిల్లలు అడిగే వివిధ ప్రశ్నలకు మనం ఎంతో ఓపికగా సమాధానం చెప్పాలని కోరారు.

దానివలన చిన్నారుల్లో మానసిక ఉల్లాసం పెరిగి చదువుతోపాటు అన్ని రంగాల్లో ముందుంటారన్నారు. తల్లిదండులు తమ పిల్లలకు బాల్యం నుంచే వారి పనులు వారు చేసుకునేలా సూచించడం వలన వారిలో శ్రమైక జీవన సౌంద ర్యాన్ని తెలుసుకోగలగడంతో పాటు భవిష్యత్తులో గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దబడుతార న్నారు. డైరెక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ ఇటువంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహించ డం వలన చిన్నారులకు స్కూల్స్, చదువుపై ఆసక్తి కలిగి ఉత్సాహంగా, ఆనందంగా స్కూ లుకు వస్తారన్నారు. స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యేయేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొ ని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.