31 August, 2026 | 9:32 AM

Breaking News

భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. బోనం ఎత్తిన ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి   •   క్రీడా స్ఫూర్తితో గెలపోటములను స్వీకరించాలి: ప్రాజెక్టు అధికారి రాహుల్   •   చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పొడిగించాలి   •   ఆదివాసి యువతి శిరీష కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలి   •   యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ గొప్ప అవకాశం   •   యావాపూర్ లో ఘనంగా బోనాలు   •   అత్యంత వైభవంగా బోనాల పండుగ   •   సాంబ శర్వాణి రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి   •   ఉమ్మడి మానాలలో పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి   •   కౌకూర్ మోడల్ మార్కెట్ భవనం కోసం నాలుగో రోజు ధర్నా   •  

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఫిక్సింగ్ పాలిటిక్స్

21-04-2026 02:22 AM
  1. రేవంత్‌రెడ్డి, కేసీఆర్ ఒకేరోజు భారీ సభలు
  2. ఇది యాదృచ్ఛికం కాదు.. ముందే రాసుకున్న స్క్రిప్ట్
  3. బీజేపీ ముఖ్యఅధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్

హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రజలను మోసం చేయడానికి పరస్పర అవగాహనతో రాజకీయ నాటకాలు ఆడుతున్నాయని, ఆ రెండు పార్టీల మధ్య ఫిక్సింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఒకేరోజు జిల్లాల్లో పోటాపోటీగా భారీ సభలు నిర్వహించడం యాదృచ్ఛికం కాదని, ఇది ముందే రాసుకున్న స్క్రిప్ట్ అని విమర్శించారు.

ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఎదుగుతుండటాన్ని జీర్ణించుకోలేక, ఆ ప్రభంజనాన్ని అడ్డుకోవడానికే ఈ ఇద్దరు నేతలు ఒక్కటయ్యారని ఆరో పించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం పదవి పోయి 26 నెలలైనా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా, ప్రతిపక్ష నేతగా కనీసం అసెంబ్లీకి కూడా కేసీఆర్ సరిగ్గా రావడం లేదని మండిపడ్డారు.

ప్రజల సమస్యలపై గళమెత్తకుండా, స్వప్రయోజనాలకే ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఎద్దేవాచేశారు. కేంద్రమం త్రి కిషన్‌రెడ్డి చెప్పినట్లు సీబీఐ విచారణకు పూర్తిస్థాయిలో అనుమతి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందన్నారు.