‘ఫీజు’ రద్దుపై బీసీ యుద్ధం
- కాలేజీల బంద్‌కు బీసీ సంఘాలు పిలుపు
- 30న ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో...
- జూలై 2న జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో బీసీ జేఏసీ బంద్
- 15న చలో హైదరాబాద్.. విద్యార్థి మార్చ్
హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రద్దు చేసే ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈనెల 30న ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కాలేజీల బంద్‌తోపాటు జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు.
జూలై 2న కాలేజీల బంద్‌తో పాటు వేలాది మంది విద్యార్థులతో 15న చలోహైదరాబాద్‌ను నిర్వహించి, సుందరయ్య పార్క్ నుంచి ఇందిరా పార్క్ వరకు విద్యార్థి మార్చ్‌ను బీసీ జేఏస్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ చేపట్టనున్నారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చారు. రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ బీసీ సంఘాలు కాలజీల బంద్‌ను చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి.
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం యోచి స్తోందన్న ప్రచారంపై బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గత కొంతకాలంగా ఫీజు బకాయిలు విడుదల చేయ కుండా పెండింగ్‌లో పెట్టడం వల్ల రాష్ట్రంలో ని దాదాపు 18 లక్షల మంది పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు అంధకా రంలో పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేదవి ద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని బీసీ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్ర భుత్వానికి విద్యార్థులు, నిరుద్యోగుల శక్తి ఏం టో చూపిస్తామని జూన్ 30న, జూలై 2న, 15న నిర్వహించబోయే ఉద్యమాల ద్వారా ప్రభుత్వానికి నిరసన సెగ అంటే ఏంటో తమ సత్తా చాటుతామని హెచ్చరిస్తున్నారు.






