అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి
రైతుల ధాన్యం కొనుగోలు పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ పార్టీ
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్ రెడ్డి
తుంగతుర్తి,(విజయక్రాంతి): అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, 64 % మంది ప్రజలు మళ్ళీ కేసీఆర్ ని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సోమవారం అర్వపల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అధ్యక్షతన నియోజకవర్గస్థాయి బి ఎల్ ఎ సమావేశం నిర్వహించి పాల్గొని మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలకు మారు పేర్లు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవ చేశారు.
రాష్ట్రంలో 1.50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ప్రగల్ బాలు పలుకుతూ పేపర్లో యాడ్లు ఇస్తూ, పబ్బం గడుపుతున్నారని, నేటి వరకు గ్రామాల్లోని ఐకెపి సెంటర్లో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో, రైతుల తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన తొమ్మిది సంవత్సరాలు ఎస్సారెస్పీ కాలువ ద్వారా గోదావరి జలాలు తీసుకువచ్చి గ్రామాలను సస్యశ్యామల చేసిన ఘనత కేసిఆర్ కే దక్కిందని కొనియాడారు. గత సంవత్సరం ఒక యూరియాకే యాప్ పెడితే, నేడు డిఏపి కూడా యాప్ పెట్టారని విమర్శించారు.
రాష్ట్రంలోని అధికారులతో మీటింగ్ పెడితే, కనీసం వారితో సమన్వయం చేసుకోలేక నా మాట వినుటలేదని దద్దమ్మ మాటలు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. బిజెపి కాంగ్రెస్ పార్టీ కలిసి సర్ పేరుతో దొంగ ఓట్లకు కుట్రలు పడుతున్నారని ఆరోపించారు. గ్రామాల్లోని ప్రతి బి ఎల్ ఏ ఒక సైనికుల్లా పనిచేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వంతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని,64% ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ను కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.






