15 June, 2026 | 9:56 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

సమ్మె విరమిస్తున్నాం... యధావిధిగా పనులు

15-06-2026 08:44 PM

జవహర్ నగర్ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం

జవహర్ నగర్,(విజయక్రాంతి): సమ్మె విరమిస్తున్నాం యధావిధిగా పనులు కొనసాగుతాయని భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం నాయకులు స్పష్టం చేశారు. సెంట్రింగ్ మేస్త్రీల అహంకార వ్యాఖ్యలను నిరసిస్తూ  బిఎన్ఆర్కేఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తాపీ మేస్త్రీలు గత కొన్ని రోజులుగా చేస్తున్న సమ్మెను సోమవారం విరమిస్తున్నామని భవన నిర్మాణాంగాల కార్మికులు తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ నిర్మాణ రంగంలో సెంట్రింగ్ తాపీ మేస్త్రీల బంధం విడదీయ రానిదని పేదలపై ఆర్థిక భారం మోపకుండా అడ్డగోలుగా రేట్లను పెంచడం తగదని అన్నారు. కార్మికుల సంక్షేమంపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని పేర్కొన్నారు. తాపీ మేస్త్రీల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపిన ప్రజాప్రతినిధులకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.