రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'
కోదాడ,(విజయక్రాంతి): రెడ్లకుంట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు 'బడి బాట' సోమవారం అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. సర్పంచ్ పోలంపల్లి కుటుంబరావు, ఉపసర్పంచ్ మల్లెల ప్రసాదరావు మాట్లాడుతూ, గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన విద్యా ప్రమాణాలను అందిస్తున్నాయని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే, తాను వ్యక్తిగతంగా పాఠశాల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్నానని, దాతల సహకారంతో పాఠశాలను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీగల నరేష్ గారు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామ ప్రముఖులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు






