రామలక్ష్మి పురం ప్రాథమిక పాఠశాల బడి పునఃప్రారంభం
సర్పంచ్ గంగిరెడ్డి తులిశమ్మ కన్నారెడ్డి
కోదాడ,(విజయక్రాంతి): కోదాడ మండలం పరిధిలోని రామలక్ష్మి పురం ప్రాథమిక పాఠశాల బడి పున ప్రారంభించారు. సోమవారం పాఠశాలలో జరిగిన సమావేశంలో గ్రామ సర్పంచ్ గంగిరెడ్డి తులిశమ్మ కన్నారెడ్డి మాట్లాడుతూ పిల్లలు ప్రభుత్వ స్కూల్లో నాణ్యమైన విద్య భోజనము పుస్తకాలు స్కూల్ డ్రెస్ తదితర మెటీరియల్స్ అందిస్తున్నారు కావున విద్యార్థిని విద్యార్థి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత విద్య భోజనం వసతి సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల చైర్మన్ జ్యోతిరాణి, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు కార్యదర్శి ఉపేందర్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుఅన్నెం పాపిరెడ్డి దేవాలయం వైస్ చైర్మన్ నరసింహారెడ్డి సర్పంచ్ సీతారాములు ఉపాధ్యాయురాలు సుజాత అంగన్వాడి టీచరు స్వరాజ్యం ఆయా పార్వతమ్మ గ్రామ పెద్దలు రామయ్య వెంకట్ రాములు స్కూల్ పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు






