ఘనంగా పాఠశాల పునఃప్రారంభం
15-06-2026 09:21 PM
చందుర్తి,(విజయక్రాంతి): చందుర్తి మండలం మరిగడ్డలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా పాఠశాల పునః ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు .పాఠశాలను అందంగా అలంకరించి, విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేస్తూ ఒక్కొక్క విద్యార్థిని పాఠశాలకు ఆహ్వానించారు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలని విద్యార్థులకు సూచించారు. ప్రధానోపాధ్యాయురాలు భార్గవి మాట్లాడుతూ పాఠశాలలో విద్యాబోధన, ఆటలతో పాటు సహ పాఠ్య కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి మన ఊరు బడిని కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామస్వామి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.






