11 May, 2026 | 2:05 PM

Breaking News

వెంచర్లో అక్రమాలపై కుల సంఘాల పిర్యాదు   •   యూనియన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించం!   •   మొగిలిపేట క్లస్టర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం   •   ​తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి   •   పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న   •   బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •  

ఈ ఆట గుర్తుందా?

25-05-2025 12:00 AM

పల్లెటూరి వాతావరణంలో పెరిగిన ప్రతి ఒక్కరికి పులి మేక ఆట గురించి తెలిసే ఉంటుంది. మట్టి మైదానంలో, చెట్టు నీడలో, ఇంటి ముందు వరండాలో అప్పుడప్పుడు ఈ ఆటను ఎంతో ఇష్టంగా ఆడేవాళ్లం. పులిగా ఉన్నవాడు మేకలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే, మేకలుగా ఆడేవాడు పులి చేతికి దొరకకుండా తప్పించేవాడు. మేకలుగా చిన్నరాళ్లను, పులిగా అంతకన్నా కాస్త పెద్ద రాళ్లను పెట్టి పులి మేక ఆడేవాళ్లం.

ఈ ఆటలో గెలవడానికి మనకు తెలియకుండానే ఎన్నో వ్యూహాలు రచించేవాళ్లం. ఈ ఆట ఆడుతుంటే సమయం ఎలా గడిచిపోయేదో తెలిసేదే కాదు. ఎంతసేపు ఆడినా అలసిపోయేవాళ్లం కూడా కాదు. ఈ ఆధునిక యుగంలో పిల్లలు చాలా వరకు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లలో గేమ్స్ ఆడుతూ బంగారం లాంటి సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. చిన్నతనంలో ఇలాంటి ఆటలు ఆడితే.. సృజనాత్మకత పెరుగుతుంది.