9 May, 2026 | 4:59 AM

హత్య కేసు నిందితుడి రిమాండ్

09-05-2026 01:33 AM

కోదాడ మే 8: పట్టణంలో సంచలనం సృష్టించిన శిరీష హత్య కేసు నిందితుడైన భర్త పాయిలి మణిదీప్ను అరెస్టు చేసి శుక్రవారం కోదాడ కోర్టులో రిమాండ్ చేసినట్లు పట్టణ సీఐ శివశంకర్ పేర్కొన్నారు.  పట్టణ సీఐ తెలిపిన వివరాల ప్రకారం భార్యాభర్తల మధ్య వివాదాల నేపధ్యంలో తాము కౌన్సిలింగ్ నిర్వహించినట్లు, ఈ క్రమంలో మృతురాలు తనకు భర్తతో కలిసి జీవించడం ఇష్టం లేదని చెప్పడాన్ని తీవ్ర అవమానంగా భావించిన మణిదీప్ అవకాశం చూసి కోదాడ బస్టాండ్ ఏరియాలో శిరీషపై కత్తితో దాడి చేసి హత్య చేశాడని, విచారణలో మణిదీప్ నేరాన్ని అంగీకరించాడని పేర్కొన్నారు.