20 May, 2026 | 3:45 AM

కోలీవుడ్ ఎంట్రీకి సై!

20-05-2026 01:36 AM

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది. భాషతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ఛాన్సులు అందుకుంటూ ఫుల్ ఫామ్‌లో ఉందీ సుందరి. ఇప్పటికే ఎన్టీఆర్ సరసన ‘దేవర’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలుకరించిన ఈ ముద్దుగుమ్మ త్వరలో ‘పెద్ది’తో కలిసి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా జూన్ 4న థియేటర్లలోకి రాబోతోంది. ఇదిలావుంటే, తాజాగా జాన్వీ కపూర్‌కు సంబంధించి మరో అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తొలి సినిమాతోనే టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన జాన్వీ.. ఇప్పుడు కోలీవుడ్‌లోనూ అడుగుపెడుతోందని సమాచారం. తమిళ స్టార్ చియాన్ విక్రమ్ వారసుడు ధ్రువ్ విక్రమ్ నటిస్తున్న ఓ కొత్త సినిమాలో ఆయన సరసన నటించనుందట జాన్వీ. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే తెలుగులో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిన జాన్వీ.. ఇప్పుడు కోలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది.

నటన, అందం, డ్యాన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే జాన్వీ.. యాక్టింగ్ పరంగా సత్తా చాటుతున్న ధ్రువ్‌తో జతకడుతుండటంపై నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు తుది దశకు చేరుకున్నా యని టాక్. త్వరలోనే జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. జాన్వీ కపూర్ భాగమవుతోందన్న వార్తల నేపథ్యంలో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.