30 July, 2026 | 5:49 PM

Breaking News

రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి   •   గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •  

చివరి శ్వాస వరకు వినోదం పంచుతా

20-05-2026 01:33 AM

‘సుడిగాలి సుధీర్’గా పాపులరైన సుధీర్ ఆనంద్ టెలివిజన్, సినిమా రంగాల్లో అలరిస్తున్నారు. ఆయన హీరోగా ‘సుధీర్ జోకర్‘ అనే కొత్త చిత్రం రాబోతోంది. బిగ్‌బాస్ ఫేమ్ అయేషా ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం కానుంది. ఈ చిత్రంలో అభిరామి, మురళీధర్‌గౌడ్, మురళీశర్మ, అజయ్ ఘోష్, విష్ణు ఓయ్, రమేశ్ ఇందిరా ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు.

మంగళవారం సుధీర్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా బ్యాంగర్ రిలీజ్ చేశారు. ఇదే వేదికపై ఫ్యాన్స్ ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. ‘చివరి శ్వాస వరకు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాన’ని చెప్పారు. చిత్రబృందమంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

‘హైలెస్సో’ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి

సుడిగాలి సుధీర్ తాజా ప్రాజెక్టు ‘హైలెస్సో’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంతో ప్రసన్నకుమార్ కోట దర్శకుడిగా పరిచయమవుతు న్నారు. శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. సుధీర్ హీరోగా నటిస్తున్న ఐదో చిత్రమిది. ఇందులో ప్రముఖ నటుడు శివాజీ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. నటాషా సింగ్, నక్షా సరన్ కథానాయిక లుగా నటిస్తుండగా, కన్నడ నటి అక్షర గౌడ కీలక పాత్రలో కనిపించనుంది. మంగళవారం సుధీర్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ మేకర్స్ ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సుధీర్.. మువ్వలు కట్టిన ఖడ్గాన్ని చేత పట్టుకుని, రక్తపు మరకలతో ఎంతో రఫ్, ఇంటెన్స్ అవతార్‌లో కనిపించారు. ఈ ఏడాది చివరలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం వంటి దక్షిణాది భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.