18-02-2026 01:34:06 AM
ఖానాపూర్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. సోమవారం జరగాల్సిన ఈ ఎన్నిక కోరం లేకపోవడంతో మంగళవారానికి వాయిదా పడగా.. మంగళవారం కూడా వాయిదా పడింది. మంగళవారం ఉదయం నుంచి మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి అభ్యర్థుల కోసం ఎదురు చూశారు. కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులు ఉదయం కార్యాలయానికి హాజరుకాగా మిగిలిన రెండు పార్టీల కౌన్సిలర్ అభ్యర్థులు రాకపోవడంతో కోరం లేదని అధికారులు ఎన్నిక వాయిదా వేశారు.