18-02-2026 01:33:50 AM
ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): మంత్రి వివేక్ కాన్వాయ్‌పై జరిగిన దాడిని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఖండించారు. ‘వీధి గూండాలని కేటీఆర్ పెంచి పోషిస్తున్నాడని, క్యాతనపల్లిలో బాల్క సుమన్ రౌడీయిజం చేస్తున్నాడని ఫైర్‌అయ్యారు. ‘ఎంపీగా బాల్క సుమన్ పనిచేసినా కూడా చిల్లర పనులు మానుకుంట లేవు.
మంత్రి కాన్వాయ్ పై రాళ్లదాడి చేస్తావా? చెన్నూరు ప్రజలు నీకు గతంలో అవకాశం ఇచ్చింది దేని కి. రౌడీయిజం.. గూండాయిజం చెయ్యడానికా? 2023లో చెన్నూ రు ప్రజలు నీకు బుద్ధి చెప్పిన సిగ్గు రాలేదు. ప్రజా ప్రభుత్వంలో నీలాంటి ధగా కోర్ రౌడీలకు ఆస్కారం లేదు. ఇప్పటికైనా నీ సుతి, మతి మార్చుకో’ అంటూ హెచ్చరించారు.