శంకర్‌గౌడ్ కుటుంబసభ్యులకు రూ.10 లక్షల చెక్కు అందజేసిన ఆర్డీఓ ఉమారాణి
మహబూబాబాద్, మే 5 (విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కోలాశంకర్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మబలిదానం చేసుకున్నారు. ఈ సంఘటనపై స్పందించిన ప్రభుత్వం కోల శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.
ఈ మేరకు మంగళవారం నర్సంపేట ఆర్డిఓ ఉమారాణి ముత్తుజిపేటకు చేరుకొని శంకర్ గౌడ్ సతీమణి కోల హేమలతకు ప్రభుత్వం మంజూరు చేసిన 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. సందర్భంగా ఆర్డీవో ఉమా రాణి మాట్లాడుతూ శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని, ఉద్యోగం ఇచ్చేందుకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సోమవారం ఆర్టీసీ ఎండీతో చర్చించారని, అతి త్వరలో శంకర్ గౌడ్ కుమారుడు హేమంత్ కు కార్పొరేషన్ లో ఉద్యోగం ఇప్పించడం జరుగుతుందన్నారు.






