26 May, 2026 | 4:41 PM

యశోద ఆసుపత్రిలో అరుదైన చికిత్స విజయవంతం

26-05-2026 03:44 PM

వనపర్తి టౌన్ : అపెండిక్యులర్ మాస్తో కూడిన కోలస్ క్యాన్సర్స్ కు అరుదైన చికిత్స యశోద ఆసుపత్రిలో(Yashoda Hospital) అందించి విజయవంతం అయిందని యశోద సూపర్ స్పెషాలీటి ఆసుపత్రి మలక్ పేట డైరెక్టర్ పవన్, యూనిట్ హెడ్ శ్రీనివాస్ రెడ్డి లు తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రం లోని ఓ ప్రవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.  

వనపర్తి జిల్లాకు చెందిన 51 ఏళ్ల శ సుగురు యాదమ్మ తీవ్రమైన కడుపు నొప్పి, జ్వరం, కడుపులో గడ్డతో మలక్పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. పరీక్షల్లో అపెండిక్యులర్ మాస్తో పాటు కోలస్ క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స అనంతరం రోగికి యాంటీబయోటిక్స్, నొప్పి నివారణ చికిత్స, డయాబెటిస్ నియంత్రణ మరియు ప్రత్యేక పర్యవేక్షణ అందించామని, ప్రస్తుతం రోగి ఆరోగ్యం మెరుగుపడి స్థిరపడటంతో అవసరమైన సూచనలతో డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు.

పెండిక్యులర్ మాస్ మరియు కోలస్ క్యాన్సర్ వంటి సమస్యలను ప్రారంభ దశలో గుర్తించి సరైన శస్త్రచికిత్స చేయడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చు. అత్యాధునిక లాపరోస్కోపిక్ మరియు ఆంకాలజీ సర్జరీలతో మంచి ఫలితాలు సాధించవచ్చనన్నారు. అపెండిక్యులర్ మాస్తో కూడిన కోలస్ క్యాన్సర్ వంటి క్లిష్టమైన ఉదర సంబంధిత వ్యాధులను ప్రారంభ దశలోనే ఖచ్చితంగా నిర్ధారించి, అత్యాధునిక లాపరోస్కోపిక్ మరియు ఆంకాలజీ శస్త్రచికిత్సల ద్వారా విజయవంతంగా చికిత్స అందించడం ఆసుపత్రి నైపుణ్యాన్ని చాటిచెప్పిందని వారు పేర్కొన్నారు