26 May, 2026 | 5:09 PM

Breaking News

భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •   ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •  

ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది

26-05-2026 04:18 PM

వి ఓ ఎ ల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి – బిజెపి నాయకులు తంబళ్ళ రవి

దమ్మపేట, మే 26(విజయ క్రాంతి): మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట వి ఓ ఎ లు వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న నిరవధిక సమ్మెకు అశ్వారావుపేట నియోజకవర్గ బీజేపీ నాయకులు తంబళ్ల రవి, బీజేపీ పార్టీ తరుపున మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా తంబళ్ళ రవి మాట్లాడుతూ కొన్ని రోజులుగా వి ఓ ఎ లు నిరసన తెలియజేస్తున్నా కూడా ఏ అధికారికి చలనం లేదని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని గాలికి వదిలేశారని, గత ప్రభుత్వం బి ఆర్ ఎస్ పార్టీ పాలించిన విధంగానే కాంగ్రెస్ పార్టీ పాలన ఉందని, గత ప్రభుత్వానికి ఆడ బిడ్డల ఉసురు తగిలి ఫాం హౌస్ కె పరిమితం అవ్వాల్సి వచ్చిందని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అదే అవుతుందని, ఈ రెండేండ్లలోనే విపరీతమైన వ్యతిరేకత మూట కట్టుకున్నదనీ, పని చేయించుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వారిని చిన్న చూపు చూడడం సరికాదని, వెంటనే వి ఓ ఎ ల డిమాండ్లను పరిష్కరించకపోతే వారితో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు ఉడతనేని విశ్వేశ్వరరావు, గూడా ముత్యాలరావు, దొడ్డ సతీష్, కారం రత్నకుమారి, సుజాత తదితరులు పాల్గొన్నారు.