కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ
26-05-2026 04:40 PM
ఇల్లందు, మే 26 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల పెంపు కార్మికులకు లాభం కంటే నష్టమే కలిగిస్తోందని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జే.సీతారామయ్య అన్నారు. మంగళవారం ఇల్లందులో జరిగిన ఐఎఫ్‌టీయూ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అమలులో ఉన్న వేతనాల కంటే ప్రభుత్వం ప్రకటించిన వేతనాలు తక్కువగా ఉండటంతో అన్‌స్కిల్డ్ నుంచి హైస్కిల్డ్ కార్మికుల వరకు వేల రూపాయల నష్టం జరుగుతోందన్నారు. కనీస వేతనాలపై పునఃసమీక్ష చేపట్టి కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించాలని, నాలుగు లేబర్ కోడ్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కొక్కు సారంగపాణి, తోడేటి నాగేశ్వరరావు, డి.ప్రసాద్, ఎన్.సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.






