26 May, 2026 | 5:29 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ

26-05-2026 04:39 PM

ఇల్లందు, మే 26 (విజయక్రాంతి): కోయగూడెం ఓపెన్‌కాస్ట్‌లో ఎల్‌ఎస్‌ఎన్ కంపెనీలో పనిచేస్తున్న ఓబీ కార్మికుల ఈపీఎఫ్ గత 12 నెలలుగా ఖాతాల్లో జమ కావడం లేదని, వెంటనే జమ చేయాలని కోరుతూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(ఐఎఫ్‌టీయూ) ఆధ్వర్యంలో ఇల్లందు ఏరియా జీఎం వీసం కృష్ణయ్యకు వినతిపత్రం అందజేశారు. సమస్య పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడతామని నాయకులు ఎన్ సంజీవ్, తోడేటి నాగేశ్వరరావు, డి ప్రసాద్ హెచ్చరించారు.