26 May, 2026 | 4:44 PM

మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి

26-05-2026 04:15 PM

హాజరుకానున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు

మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్

మంథని మే 26 (విజయక్రాంతి): రేపు మంథనిలో  నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడమైనదని, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు  హాజరుకానున్నారని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.   బుధవారం సాయంత్రం 5:30 గంటలకు మంథని పట్టణంలోని శివ కిరణ్ గార్డెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ, మండల,  కమిటీ ఏర్పాటు పై సమీక్ష సమావేశం నిర్వహించబడునని,  ఈ సమావేశానికి శ్రీను బాబు హాజరైతరని,  మంథని నియోజకవర్గంలోని అన్ని మండల పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, గ్రామ శాఖ అధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్ లు పార్టీ ముఖ్య నాయకులు, ఆశవాకులు తప్పనిసరిగా సమయానికి హాజరుకావాలని అ ప్రకటనలో తిరుపతి యాదవ్ కోరారు.