41 ఏళ్ల మహిళకు అరుదైన చికిత్స
మెడికవర్ ఆస్పత్రి వైద్యుల ఘనత
హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): యోనిలో ఏర్పడిన అరుదైన రక్తనాళాల కణి తి (వజైనల్ హీమాంజియోమా) కారణంగా తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న 41 ఏళ్ల మహిళకు మెడికవర్ ఉమెన్ అండ్ చైల్ హా స్పిటల్, హైటెక్ సిటీ వైద్యులు అత్యాధునిక ఇమేజ్ గైడెడ్ ఎంబోలైజేషన్ చికిత్స ద్వారా విజయవంతంగా ప్రాణాలు కాపాడారు. పెద్ద శస్త్రచికిత్స అవసరం లేకుండానే రక్తస్రావాన్ని పూర్తిగా నియంత్రించి రోగిని ఆరోగ్యంగా కోలుకునేలా చేశారు.
వైద్యుల బృం దంలోని డా. టి. రఘు తేజస్వి, డా. జె. శాలి ని నారాయణ్, డా.సాయితేజ నమాల సంయుక్తంగా ఈ చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అరుదైన గైనకాలజీ అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, గైనకాలజీ విభాగాల సమన్వ యంతో మినిమల్లీ ఇన్వేసివ్ చికిత్స అందించడం వల్ల రోగి త్వరగా కోలుకున్నారని వైద్యులు తెలిపారు.






